తుని పట్టణంలోని పాత బజారు వీధిలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి ప్రభుత్వం కొత్తగా ట్రస్ట్ బోర్డు కమిటీని గురువారం ప్రకటించింది. ఈ కమిటీ ఛైర్మన్ కుక్కడపు బాలాజీను నియమించింది. ఆలయ అభివృద్ధి, పాలనను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉమ్మిడి వెంకటరమణ, సత్య సుధాకర్, సీతారామరాజు, దర్భా శ్రీనివాస్, శ్రీనివాసంతి, బోడపాటి నాగమణి, రమ్య, రమణమ్మ, భాస్కరాచార్యులు సభ్యులుగా ఉన్నారు.