వృద్ధురాలికి రోటరీ చేయూత.. ఆశ్రయం కల్పించిన సేవాభావం

మానవత్వాన్ని చాటిచెప్పే సేవా కార్యక్రమంలో భాగంగా, రోటరీ క్లబ్ సభ్యులు ఓ నిరాశ్రయ వృద్ధురాలికి అండగా నిలిచారు. సొంతవారు లేక శిథిలావస్థలో ఉన్న ఇంటి బాత్రూంలో నివసిస్తున్న వృద్ధ మహిళ పరిస్థితిని గుర్తించిన రోటరీ సభ్యులు, డాక్టర్ సురేష్ కుమార్ సహకారంతో సుమారు రూ. 45 వేల వ్యయంతో కొత్త షెల్టర్ నిర్మించి అందజేశారు. అంతేకాకుండా నిత్యావసర సరుకులను కూడా అందించి ఆమెకు భరోసా కల్పించారు. ఈ సేవా కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు. రోటరీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్