ప్రతి అర్హుడికి పథకాలు చేరాలి: ఎమ్మెల్యే దివ్య

తేటగుంట క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన టీడీపీ శ్రేణుల కీలక సమావేశం జరిగింది. చేపూరు, రాజుపేట గ్రామ నాయకులతో జరిగిన ఈ భేటీలో, ప్రభుత్వ పథకాల అందజేతలో అర్హతే ప్రామాణికంగా ఉండాలని దివ్య స్పష్టం చేశారు. ప్రతి అర్హుడికి న్యాయం జరిగేలా చూడటం కార్యకర్తల బాధ్యత అని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన "సూపర్ సిక్స్" పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్