తునిలో ఇస్కాన్ ఆలయ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో, ఇస్కాన్, అక్షయ పాత్ర ప్రతినిధుల బృందం మంగళవారం మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, తుని ఎమ్మెల్యే యనమల దివ్యలను కలిసి వినతిపత్రం అందజేసింది. ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ సహకారం అందించాలని కోరగా, యనమల రామకృష్ణుడు, దివ్య తమ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.