తొండంగి మండలం పి. అగ్రహారం గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే యనమల దివ్య రైతులకు నూతన పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో పాస్ పుస్తకాలపై ఉన్న ఫోటోలను తీసేసి, ఇప్పుడు ప్రభుత్వ రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోందని ఆమె తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని, అన్నదాతల ఆత్మగౌరవం పెరిగిందని ఎమ్మెల్యే దివ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత యనమల రాజేష్, మండల అధ్యక్షుడు చొక్కా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.