తాగి వాహనాలు నడిపిన 26 మందిపై కేసులు నమోదు చేశామని సీఐ గీతారామకృష్ణ తెలిపారు. తుని టౌన్ లో తాగి వాహనాలు నడిపే వారిని కంట్రోల్ చేయాలని, రోడ్డు ప్రమాదాలు నివారించాలని ఉద్దేశంతో తుని టౌన్ లో వేరువేరు ప్రాంతాల్లో తాగి వాహనాలు నడిపిన 26 మందిని శనివారం తుని కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరు పరచగా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున మొత్తం రెండు లక్షల అరవై వేల రూపాయలు జరిమానా విధించారు.