తునిలో 140వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక జెండాను ఆవిష్కరించి, హక్కుల సాధనకు ప్రతిజ్ఞ చేశారు. సీఐటీయూ నాయకుడు నక్కెళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వం తక్షణమే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.