తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా మరిన్ని సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. తొండంగి మండలం వేమవరంలో నిర్మించిన సోలార్ పవర్ ప్లాంట్ ను బుధవారం జీకే కృష్ణారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. చౌకగా లభించే సోలార్ విద్యుత్తును పరిశ్రమలకు అందించగలిగితే, ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందని అన్నారు.