తొండంగి మండలం తాటియాకులపాలెంలో ఓ వృద్ధురాలు శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెను కుటుంబ సభ్యుడే కొట్టి చంపినట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న తొండంగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.