తుని ఎస్ఐసీ బిల్డింగ్ దగ్గర పార్క్ చేసిన కారులో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. చెత్తను కాల్చిన సమయంలో మంటలు వ్యాపించి కారు ఇంజిన్‌కు అంటుకున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వేగంగా అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేశారు.