తుని: నల్లబెల్లం, నాటుసారాతో నలుగురు పట్టివేత

కాకినాడ జిల్లాను ఆగస్టు నాటికి సారా రహిత జిల్లాగా చేస్తామని జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి కృష్ణకుమారి తెలిపారు. బుధవారం తునిలోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ లో ఆమె మాట్లాడారు. రౌతులపూడి మండలం లచ్చిరెడ్డిపాలెం వద్ద ఒక వ్యాన్ లో 3,400 కిలోల నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మీడియాకు తెలిపారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేశామని, 20 లీటర్ల సారాను కూడా స్వాధీనం చేసుకున్నామని ఆమె వివరించారు.

సంబంధిత పోస్ట్