తుని చిన్నారి మిస్సింగ్.. కాసేపట్లో కుక్కకు పోస్టుమార్టం

సీహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలక ఆధారంగా భావిస్తున్న పెంపుడు కుక్క మృతిచెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కుక్క మరణానికి గల కారణాలను తెలుసుకొనేందుకు ఆదివారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. వెటర్నరీ అధికారులు, వైద్యుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. పోస్టుమార్టం సంఘటనా స్థలంలోనా లేదా ఆసుపత్రిలోనా నిర్వహిస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్