తుని ఆసుపత్రిని 200 పడకలకు అప్ గ్రేడ్ చేస్తాం

తుని ఏరియా ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేయిస్తామని ప్రభుత్వ విఫ్ యనమల దివ్య పునరుద్ఘాటించారు. ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఎక్స్ రే విభాగంలో ఆలస్యాలపై ఆరా తీశారు. విద్యుత్ సమస్యల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది వివరించగా, సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోగులతో మాట్లాడి, సమస్యలను పరిష్కరించి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్