తుని మండలం ఎస్. అన్నవరం గ్రామానికి చెందిన కీర్తి బాలకృష్ణను వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా విభాగం జాయింట్ సెక్రటరీగా శుక్రవారం నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీయ్యాయి. తన నియామకానికి సహకరించిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుక్రవారం అభినందనలు తెలిపారు.