తుని: తలుపులమ్మ లోవలో వైభవంగా సామూహిక కుంకుమార్చనలు

తుని పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ అమ్మవారి లోవ క్షేత్రంలో అషాడ మాసోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. శుక్రవారం సామూహిక కుంకుమార్చన విశేషంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పూజారులు, పండితుల ఆధ్వర్యంలో జరిగిన సామూహిక కుంకుమార్చన లో పాల్గొన్నారు. ఆలయ ఈవో విశ్వనాథరాజు పర్యవేక్షణలో ఆలయ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్