నర్సిపేట గ్రామంలో శనివారం విషాద ఘటన జరిగింది. మద్యం మత్తులో తన అమ్మమ్మను మనవడే హతమార్చాడు. గ్రామానికి చెందిన 75ఏళ్ల బెనుగు దీనమ్మకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె ఉప్పాడ మండలం అమీనాబాదు, చిన్నకుమార్తె నర్సిపేటలో ఉంటున్నారు. చిన్నకుమార్తె పద్మ ఇంటిలో దీనమ్మ ఉంటుండగా, ఆమె మనవడు జాను డబ్బుల విషయంలో గొడవపడి, గొంతునులిమి చంపాడు.