పీఏసీఎస్ త్రీమెన్ కమిటీకి ఎంపికైన వారు నిరంతరం రైతుల సేవలో ఉండాలని, రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సూచించారు. కోటనందూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడుగా ఎంపికైన పెనుముచ్చు నాగేశ్వరరావుతో పాటు త్రీమెన్ కమిటీలో ఉన్న ముప్పిడి జమీలు, బైలపూడి శ్రీరామ్మూర్తి తదితరులు బుధవారం యనమలను కలిసి తమకు కీలక బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు.