తొండంగి మండలం శృంగవృక్షం గ్రామంలో పులుగు అనిల్ కుమార్ (28) అనే యువకుడు రావికంపాడు సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, మద్యం అలవాటుపై బుధవారం రాత్రి ఇంట్లో వాగ్వాదం జరిగిన తర్వాత అనిల్ బైక్‌పై వెళ్లిపోయాడు. గురువారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అన్నవరం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ త్రినాథ్ రావు ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు.