ఏపీలో స్థానిక సమరానికి ఓటర్ల జాబితాపై ఈసీ కసరత్తు!

AP: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు వేగవంతమయ్యాయి. ఈ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలను SEC ఇప్పటికే తెప్పించుకుంది. వీటి నుంచి మున్సిపల్, పంచాయతీల వారీగా కొత్త ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తోంది.ఈ ప్రక్రియ కోసం మున్సిపల్, పంచాయతీల్లోని మాస్టర్ ట్రైనీలకు శిక్షణ కూడా ఇచ్చారు. అయితే ప్రభుత్వం రిజర్వేషన్లను కరారు చేసిన తర్వాతే ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది.

సంబంధిత పోస్ట్