ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో జగన్, దాల్మియా, ఇతర నిందితులపై ఈ పత్రాలను సమర్పించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలను ఈడీ ఈ ఛార్జ్ షీట్లో పేర్కొంది. గతంలోనే జగన్ మరియు దాల్మియా కంపెనీలకు చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేసిన విషయం తెలిసిందే. సుమారు 15 ఏళ్లుగా ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.