AP: మద్యం కుంభకోణం కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్ భార్గవకు ఈడీ సమన్లు జారీ చేసింది. బుధవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్ భార్గవ పనిచేశారు. ఆయన హయాంలో రూపొందించిన మద్యం విధానం, కొనుగోళ్లు, పంపిణీలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి.