AP: మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు హైదరాబాద్లో కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్గూడ జైలు నుంచి ఆయనను ఈడీ కార్యాలయానికి తరలించారు. రెండు రోజుల పాటు ఆయనను అధికారులు విచారించనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా టెండర్లలో అవకతవకల ఆరోపణలతో నమోదైన కేసులో కారుమూరిని ప్రశ్నించనున్నట్లు సమాచారం.