AP: మెగా డీఎస్సీ-2025 పేపర్ లీక్ ఆరోపణలపై పాఠశాల విద్యాశాఖ స్పందించారు. మెగా డీఎస్సీ-2025పై వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవని కొట్టి పారేసింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షల నిర్వహణతో ప్రశ్నాపత్రాల లీకేజీ పూర్తిగా అసాధ్యమని పేర్కొంది. డీఎస్సీ పరీక్షల్లో ఎలాంటి పేపర్ లీక్, డేటా డిలీట్ కాలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.