AP: డాక్టర్ ప్రియాంక మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నేడు రాజమండ్రిలో విద్యాసంస్థల బంద్‌కు ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. ఈ ఘటనలో పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర ఆరోపణలు చేశారు. నిందితులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, కేసును నీరుగార్చేందుకు కొందరు పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.