AP: నెల్లూరులోని సరస్వతి నగర్లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. 73 ఏళ్ల శ్రీనివాసులురెడ్డి సోమవారం తెల్లవారుజామున ఇంటి మిద్దెపై వాకింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు మొదటి అంతస్తు నుంచి కింద పడిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆయనను కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.