అనకాపల్లి జిల్లాలోని రంగళివానిపాలెంలో ఎన్నికల బహిష్కరణ

AP: అనకాపల్లి జిల్లా, రంగళివానిపాలెంలో సర్పంచ్ రిజర్వేషన్ల కేటాయింపును నిరసిస్తూ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. ఈ నిరసనలో భాగంగా సుమారు 800 మంది ఓటర్లు పోలింగ్ ప్రక్రియకు దూరంగా ఉండిపోయారు. పోలింగ్ బూత్‌లో ఒక్క ఓటు కూడా నమోదు కాకపోవడంతో అధికారులు గ్రామస్తులతో చర్చలు జరుపుతున్నారు. సమస్య పరిష్కారం కోసం అధికారులు గ్రామస్థులను బుజ్జగిస్తున్నారు, కానీ గ్రామస్తులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕