సీఎం చంద్రబాబు విజయనగరం పర్యటన రద్దు అయింది. విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో పర్యటన రద్దయినట్లు అధికారులు వెల్లడించారు. దీనికి బదులుగా అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పర్యటిస్తారన్నారు. తొలుత చింతలగోరువానిపాలెంలోని లారెస్ సంస్థ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో రోడ్లకు గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రుషికొండ భవనాలను పరిశీలిస్తారు.