AP: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడటంతో పలుచోట్ల ప్రలోభాల పర్వం మొదలైంది. విశాఖలోని ఓ డివిజన్లో ఓ పార్టీకి చెందిన అభ్యర్థి ఓటుకు రూ.2 వేలు ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయవాడలోని ఓ డివిజన్లో ప్రధాన పార్టీ అభ్యర్థి మహిళలకు రూ.100 విలువైన చీరలు, స్వీట్ బాక్సులు, స్టీల్ క్యాన్లు పంపిణీ చేశారు. కొన్నిచోట్ల ఓటుకు రూ.500 నుంచి రూ.1,000 వరకు ఇస్తున్నట్లు సమాచారం. పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.