AP: విద్యుత్ ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. కరెంట్ ఛార్జీలు పెంచేది లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. పవర్ డిపార్ట్‌మెంట్ తీవ్రమైన సంక్షోభంలో ఉందని, అయినప్పటికీ విద్యుత్ రంగాన్ని సమర్థవంతంగా నడిపిస్తామన్నారు. గత పాలనలో ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని వ్యవస్థలను చక్కదిద్దుకుంటూ ముందుకెళ్తున్నామని తెలిపారు.