AP: విద్యుత్ వినియోగదారులకు మంత్రి గొట్టిపాటి రవి శుభవార్త చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని అన్నారు. వచ్చే మూడేళ్లలోనూ విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 6 లక్షల సోలార్ కనెక్షన్లను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థ మనుగడకే ముప్పు తెచ్చిందన్నారు.