విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి: గొట్టిపాటి

AP: ఉత్తరాంధ్రలో భారీవర్షాల దృష్ట్యా విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవి సూచించారు. అధికారులు ముందస్తు అంచనా వేసి ప్రణాళిక రూపొందించాలన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. లోతట్టు, తీరప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించాలన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕