AP: చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంతంలో మామిడి తోటలో మగ ఏనుగు విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. బోర్‌వెల్ మోటార్‌కు అనుసంధానించిన విద్యుత్ తీగ తక్కువ ఎత్తులో ఉండటమే దీనికి కారణమని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేసి, సమగ్ర విచారణకు ఆదేశించారు. వన్యప్రాణి నిబంధనల ప్రకారం పోస్టుమార్టం, అంత్యక్రియలు నిర్వహించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ తీగలు తగినంత ఎత్తులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.