AP: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల సంచారం కలకలం రేపింది. మక్కువ మండలం ఎర్రసామంత పరిసరాల్లో మంగళవారం రాత్రి 8 ఏనుగుల గుంపు సంచరించింది. రోడ్డుపై ఉంచిన మొక్కజొన్న పంటను తొక్కి ధ్వంసం చేశాయి. చేతికొచ్చిన పంట నష్టపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల గుంపును అటవీ ప్రాంతం వైపు తరలించాలని కోరుతున్నారు.