స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలం, పొలమూరు గ్రామంలో అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.