ఆచంట మండలం బ్రాహ్మణచెరువు అంగన్వాడీ కేంద్రం నంబర్ 21లో బుధవారం తల్లిపాల వారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏఎన్ఎం శ్రీలక్ష్మి, అంగన్వాడీ సూపర్వైజర్ రుతుమణి మాట్లాడుతూ, పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యానికి తల్లిపాలు అమృతంతో సమానమని, వాటికి మించిన పోషకాలు మరెక్కడా లభించవని గర్భిణీలు, బాలింతలకు వివరించారు. అంగన్వాడీ టీచర్ విజయమ్మ, ఆయా, ఆశ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.