పెనుగొండ: ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో కండక్టర్ మృతి

భీమవరం నుంచి రాజమండ్రి వెళ్తున్న కొవ్వూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కండక్టర్ కె. ఎస్. నారాయణ శుక్రవారం రాత్రి బస్సులోనే మృతి చెందారు. పెనుగొండ మండలం వడలి గ్రామంలోని శ్రీనివాస సర్వీసింగ్ సెంటర్ వద్దకు వచ్చేసరికి కండక్టర్ నారాయణకు గుండె నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. ఆయన మృతి పట్ల ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్