అంగన్వాడీ కేంద్రాలకు ఎమ్మెల్యే పితాని చేతుల మీదుగా ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో వంట కార్యక్రమాలు సురక్షితంగా నిర్వహించేందుకు విద్యుత్ ఆధారిత ఇండక్షన్ స్టవ్‌లను అందించడం అభినందనీయమని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. మంగళవారం పెనుమంట్ర ప్రాజెక్టు పరిధిలోని పెనుమంట్ర, పెనుగొండ, ఆచంట మండలాలకు చెందిన మొత్తం 211 అంగన్వాడీ కేంద్రాలకు ఎమ్మెల్యే ఇండక్షన్ స్టవ్‌లు, వంట పాత్రలను పంపిణీ చేశారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు అంగన్వాడీ సేవలను సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్