పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువు గ్రామంలో దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ, శుక్రవారం ఫ్రైడేడ్రైడే కార్యక్రమం నిర్వహించారు. పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్య భద్రత ఉంటుందని,ఇళ్ల వద్ద మురుగునీరు నిల్వలు, చెత్త, చెదారం ఉంచరాదని ఏఎన్ఎం లక్ష్మి సూచించారు.ఈ కార్యక్రమంలో ఆశా సిబ్బంది, అంగన్వాడీ వర్కర్స్ సువర్ణ, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.