ఆచంట మండలం వల్లూరు శివారు చిల్లేవారిపాలెంలో కుటుంబ కలహాల కారణంగా తల్లి గుండే వెంకట రమణ (47), కుమారుడు నరేంద్ర గురువారం రాత్రి యాసిడ్ తాగారు. ఈ ఘటనలో తల్లి వెంకట రమణ మృతి చెందగా, కుమారుడు నరేంద్ర భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నరేంద్రకు గతంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని, అతని పరిస్థితి విషమంగా ఉందని ఆచంట ఎస్సై కె. వెంకటరమణ తెలిపారు. శుక్రవారం కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.