పెనుగొండ పట్టణంలోని పంచాయతీ బస్టాండ్ పై అమర్చిన విద్యుత్ ఎల్ఈడీ లైట్లు గత కొన్ని రోజులుగా రాత్రి, పగలు వృథాగా వెలుగుతూ పంచాయతీకి ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయని స్థానికులు తెలుపుతున్నారు. పంచాయితీ విద్యుత్తు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని సమీపంలోని వారు తెలుపుతున్నారు. పంచాయితీ అధికారులు స్పందించి రాత్రి సమయాల్లో విద్యుత్తు లైట్లు పూర్తిస్థాయిలో వెలిగేలాగా, పట్టపగలు లైట్లు వెలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.