పెనుగొండ మండలం, వడలి గ్రామ దేవత శ్రీ మందాలమ్మ అమ్మవారి ఆలయానికి వడలి గ్రామానికి చెందిన గంగ వెంకట శివతేజ తన మొదటి నెల జీతాన్ని రూ. 87,989 ను విరాళంగా అందించారు. శివతేజ కుటుంబ సభ్యులు ఆదివారం ఈ విరాళం అందజేశారు. అమ్మవారి వెండి వస్తువులు తయారీకి వినియోగిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దాతకు కృతజ్ఞతలు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.