పెనుగొండ: నేలకొరిగిన భారీ వృక్షాలు

పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలంలో గురువారం బలమైన ఈదురుగాలులతో వర్షం కురిసింది. గాలుల వల్ల పెనుగొండ, వడలి గ్రామాల మధ్యలో పెద్దింట్లమ్మ ఆలయ సమీపంలో పెద్దపెద్ద చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. విద్యుత్‌ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. అలాగే ఒక్కసారిగా వర్షం రావడంతో వాతావరణం చల్లబడి ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్