పెనుగొండ మండలం వడల- పిట్టల వేమవరం రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెనుగొండకు చెందిన తడివాడ భార్గవ్(17) మృతి చెందాడు. స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనుక వస్తున్న వ్యాను తగలడంతో బైకు పక్కనే ఉన్న చెట్టుని బలంగా ఢీకొంది. దీంతో భార్గవ్ తలకు బలమైన గాయం కావడంతో ఘటన ప్రాంతంలో మృతి చెందాడు. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.