నకిలీ ఏజెంట్ల మాయమాటలు నమ్మి తన చెల్లెలు పొట్టకూటి కోసం మస్కట్ వెళ్లి ప్రస్తుతం అక్కడ అనేక ఇబ్బందులు పడుతుందంటూ పెనుమంట్ర మండలం మార్టేరుకు చెందిన విజయ్ శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. తన చెల్లెల్ని ఏజెంట్లు మస్కెట్‌లో అమ్మేశారని, పాసుపోర్ట్ తీసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. అధికారులు స్పందించి మస్కట్‌లో చిక్కుకుపోయిన తన చెల్లెల్ని స్వదేశానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని వేడుకుంటున్నారు.