గర్భిణీలు, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు

ఆచంట మండల కేంద్రంలోని అంగన్వాడీ కోడ్ నెంబర్ 3, 8 లో శనివారం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గర్భిణీలు, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. తల్లీ, బిడ్డల ఆరోగ్య పరిరక్షణ కోసం టీకాలు తప్పకుండా వేయించుకోవాలని ఏఎన్ఎం భాగ్యకుమారి సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు అరుణ, శాంతి, మేల్ అసిస్టెంట్ నాగభూషణం, ఆశలు సంతోషి, నీరజ, ఆయాలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్