పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలో ఓట్ల వెరిఫికేషన్ కార్యక్రమం బీఎల్ఓ వంశీ వర్మ ఆధ్వర్యంలో సోమవారం ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా అర్హులకు అవసరమైన పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి నారాయణ రెడ్డి, మేడపాటి సూర్యనారాయణరెడ్డి, వైసీపీ మండల ఎగ్జిక్యూటివ్ మెంబెర్ మేడపాటి చిన్నారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఓట్ల వెరిఫికేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది.