భీమవరం మండలం రాయలం, చిన ఆమిరం పంచాయతీల్లో నిధులు దుర్వినియోగం కేసులో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లు గురువారం తెలిపారు. రెండు పంచాయతీల్లో గతంలో పంచాయతీ కార్యదర్శులుగా పని చేసిన సాగిరాజు కిషోర్ కుమార్ రాజు, దున్న జయరాజు కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసినట్లు జిల్లా ఉన్నతా అధికారుల విచారణలో వెల్లడి కావడంతో వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.