పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని స్థానిక 7వ వార్డులో ఇంటికి రంగులు వేస్తూ జారిపడిన కూలీ తాతారావు (56) మృతి చెందాడు. తాతారావు రంగులు వేస్తూ ప్రమాదవశాత్తు తాడు జారి కిందపడి తీవ్రగాయాలపాలైనప్పుడు భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడని వన్ టౌన్ పోలీసులు తెలిపారు. దీనిపై టౌన్ పోలీసులు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.