ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్.. యువకుడు మృతి

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం నాగిడిపాలేనికి చెందిన తిరుమాని మురళీకృష్ణ (25) శనివారం తన స్నేహితుడు తిరుమాని రామకృష్ణతో కలిసి కూలి పనికి కృష్ణా జిల్లా వెళ్లి తిరిగి వస్తుండగా లక్ష్మీపురం రంగాబొమ్మ కూడలి దాటిన తర్వాత 216 జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. రామకృష్ణకు తీవ్ర గాయాలవడంతో అతన్ని భీమవరం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరు పనికి రోజు కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంకు వస్తుంటారు. రామకృష్ణ పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕