పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 41వ జాతర ఆదివారం అఖండ అన్న సమారాధనతో ముగిసింది. సేవా సమితి కార్యదర్శి రేవూరి గోగురాజు మాట్లాడుతూ, నాలుగు దశాబ్దాలకు పైగా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న ఈ జాతరలో వేలాది మంది భక్తులకు భోజనం అందించామని తెలిపారు. సుమారు 15 వేల మంది భక్తులకు ఈ అన్న సమారాధనలో విందు ఏర్పాటు చేశారు.